Vanaparthi | మార్నింగ్ వాక్ లో ఎన్నికల ప్రచారం

Vanaparthi | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి భారతీ ప్రేమ్ నాథ్ రెడ్డి సోమవారం మార్నింగ్ వాక్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉదయమే భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి వార్డు పర్యటన చేస్తూ స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగామిత్రులు,బంధువులు,పలువురు కాలనీవాసులను కలిసి తమ అభ్యర్థి త్వాన్ని వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో తమను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి,మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి లో జరిగిన ప్రగతి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.

Leave a Reply