Surrender | నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

Surrender | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ముందు నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. పునరావాస్ పునర్జీవన్ కార్యక్రమం పట్ల ఆకర్షితులైన వీరు ఆయుధాలతో సహా లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలి పీఎం మడివి బుద్రి, కిష్టారం ఏసీఎం దబ్బర్ గంగ, గొల్లపల్లి ఎల్ఓఎస్ కమాండర్ సోడి జోగా, కిష్టారం ఏసీఎం రాజే ఉన్నారు.

Leave a Reply