MLA | వైభవంగా ఆలయ 25వ వార్షికోత్సవం..
MLA | వైభవంగా ఆలయ 25వ వార్షికోత్సవం..
- ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే యార్లగడ్డ
MLA | గన్నవరం – ఆంధ్రప్రభ : దేవుడి పట్ల , ఆలయాల పట్ల రాజకీయాలు చేయటం హేయం అని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో వెలసిన విఘ్నేశ్వర, దత్తాత్రేయస్వామి సహిత శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఉత్సవంలాగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వంటలకు ప్రసిద్ధి చెందిన ఇందుపల్లి గ్రామానికి చెందిన వారు దేశవిదేశాల నుంచి ఈ వేడుకల కోసం తరలిరావడం విశేషమన్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టారు. దేవుడు అందరి కంటే గొప్పవాడని, ఆలయాల విషయంలో రాజకీయాలు చేయడం తగదని సూచించారు.
కల్తీ నెయ్యి వాడారని ఆధారాలతో సహా తెలిసినా, తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయవద్దని, భక్తి విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దాసరి వెంకట బలవర్ధనరావు, ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడు కొలుసు రవీంద్ర, గ్రామ టిడిపి అధ్యక్షులు ఉయ్యూరు మురళి, ఏఎంసీ డైరెక్టర్ కొండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి మూల్పురి సాయికల్యాణి, పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు మొవ్వ వెంకటేశ్వరరావు, పార్లమెంట్ టీడీపీ కమిటీ ట్రెజరర్ బెజవాడ నాగేశ్వరరావు, పిఏసిఎస్ చైర్ పర్సన్ చెరుకుమిల్లి వేణు, డీసీ చైర్మన్లు కొమ్మారెడ్డి రాజేష్, తుమ్మల జగదీష్, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తుమ్మల లత, పోతినేని రామకృష్ణ, మండల ఐటీడీపీ అధ్యక్షుడు పోతినేని బాపయ్య, దాసరి చంటి, కుమ్మరి వెంకటేశ్వరరావు, కొణిజేటి సాంబయ్య, మరడా పాపారావు, పొన్నగంటి బాలకృష్ణ, మేకల కోటేశ్వరరావు, మాయర రమేష్, దోనేపూడి భరత్, గరిమెళ్ళ వరప్రసాద్, అట్లూరి శ్రీనివాసరావు, మొవ్వ వేణుగోపాల్, కొల్లూరు చంద్రకాంత్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
