Parakala | బీఆర్ఎస్ లో చేరిన మాజీ కౌన్సిలర్…

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బండారి కవిత కృష్ణ కాంగ్రెస్ పార్టీని వీడుతూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బండారి కవిత కృష్ణను ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply