Collector | ఎన్నికల నిబంధనలను పాటించాలి

Collector | ఎన్నికల నిబంధనలను పాటించాలి
- నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
- జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
Collector | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ లు దాఖలు చేసే సెంటర్ ను గురువారం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని తెలిపారు.

నామినేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లు, భద్రతా చర్యలు, త్రాగునీరు, తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకంగా నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.

నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకునేలా అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ కేంద్రం పరిసరాలలో గుంపులుగా ఏర్పడకుండా చూడాలన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన అన్ని రకాల ఏర్పాట్లను భద్రతా చర్యలను అతను కలెక్టర్ భాస్కర్ రావు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ అధికారి అంజయ్య, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
