TG | ఒకరు మృతి

TG | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన తెలంగాణలోని సత్తుపల్లి పట్టణం రింగ్ సెంటర్‌లో ఇవాళ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిలి నారాయణ (60) టు వీలర్ పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

పొదిలి నారాయణ ఇంటింటికీ, గ్రామ గ్రామాన తిరుగుతూ ఫ్యాన్సీ వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. మృతుడికి భార్య పొదిలి లక్ష్మి, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఈ సంఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply