check | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

check | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
- తహసిల్దార్, ఎంపీడీవో
check | కుంటాల, ఆంధ్రప్రభ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని తాహశీల్దార్ ఆడే కమల్ సింగ్ ఎంపీడీవో అల్లాడి వనజలు తెలంగాణ ఆదర్శ పాఠశాల హాస్టల్ వసతి గృహాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అలసత్యం చేస్తే సహించేది లేదని మెనూ ప్రకారం భోజనం పెట్టాలని రోజువారీగా విద్యార్థుల యొక్క స్టాక్ రిజిస్టర్ నమోదు చేయాలని పేర్కొన్నారు.

అదేవిధంగా విద్యార్థులకు అధికారులు కలిసి భోజనం వడ్డించి.. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్ లోని కూరగాయలు, గుడ్లు, పప్పు, బియ్యం, తదితర వాటిని పరిశీలించారు. నాణ్యత లోపిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రికార్డులను పరిశీలించి.. సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సాయి ప్రద నిర్వాహకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
