Road Accident | బాలిక మృతి.. 8మందికి గాయాలు

Road Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా రాయుడుపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఓ బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో మరో 8మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
