Utkoor | లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుదాం….

Utkoor | లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుదాం….

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన మొక్కలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మొగ్దుమ్ పూర్ సర్పంచ్ తిరుమలేష్, ఈసీ మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుంపూర్ లో నర్సరీ ఫీడర్ చానల్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2025 -26 ఏడాదికి గాను 5500 నాణ్యమైన పండ్లు పూలు తదితర మొక్కలను నాటుదామని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం నర్సరీల ద్వారా మొక్కలు పెంచుతుందని నాటిన ప్రతి మొక్కను రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఉపాధి హామీ పనులను ప్రతి ఒక్కరూ సద్వినియోగంచేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే వివిధ పనులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సరీలో మొక్కలను పుష్కలంగా పెంచే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, టెక్నికల్ అసిస్టెంట్ శివరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాము వార్డు సభ్యుడు నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply