AP CM | ఏపీ కేబినెట్ సంతాపం

AP CM | ఏపీ కేబినెట్ సంతాపం

AP CM | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇవాళ ఉదయం ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఇవాళ ఏపీ మంత్రివర్గ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలోనే విమాన ప్రమాదంపై ప్రస్తావిస్తూ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. అజిత్‌ పవార్‌ సహా ఐదుగురు మృతిపై విచారం వ్యక్తం చేశారు. అజిత్‌ పవార్‌ మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆకస్మిక మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదం మహారాష్ట్రతో పాటు దేశానికి తీరని లోటని మంత్రి లోకేష్‌ అన్నారు.