Allu Arjun | తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా…?

Allu Arjun | తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా…?

Allu Arjun | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప (Pushpa) సినిమాతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసారో తెలిసిందే. పుష్ప రాజ్ తగ్గేదేలే.. అంటూ బన్నీ టాలీవుడ్ బాక్సాఫీస్ ని కాదు.. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. పుష్ప 2తో అయితే.. చరిత్ర సృష్టించాడు. ఈ సెన్సేషనల్ మూవీ తర్వాత తెలుగు దర్శకుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి కానీ.. అట్లీతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీకి తెలుగు దర్శకులు నచ్చడం లేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు ఏమైంది..?

Allu Arjun

Allu Arjun | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో..

పుష్ప 2 తర్వాత.. అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి. ఈ క్రేజీ కాంబో మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. బన్నీ.. ప్లాన్ మార్చి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ (Director) అట్లీతో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించాడు. ఈ సినిమాని కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. జూన్ కి బన్నీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో నెక్ట్స్ మూవీని ఆతర్వాత ఆగష్టులో పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని తెలిసింది.

Allu Arjun

Allu Arjun | అయితే.. అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ..

తర్వాత సినిమా అయినా త్రివిక్రమ్ తో చేస్తాడనుకుంటే.. మళ్లీ మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. లోకేష్‌ కనకరాజ్.. కూలీ (Coolie) సినిమాతో ప్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ.. హిట్, ప్లాపులు గురించి పట్టించుకోకుండా లోకేష్ తో సినిమాని అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశాడు ఐకాన్ స్టార్. ఇలా కోలీవుడ్ డైరెక్టర్స్ అట్లీ, లోకేష్‌ కనకరాజ్ లతో సినిమాలు చేస్తుండడంతో బన్నీకి తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

Allu Arjun

Allu Arjun | బన్నీతో సినిమా చేయాలని..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా సౌండ్ చేశాడు బన్నీ. దీంతో బన్నీతో సినిమా చేయాలని టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ బన్నీతో సినిమా (Movie) చేయాలని ట్రై చేస్తున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత బన్నీ, భన్సాలీ ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. దీంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. సెట్ కాలేదు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా సెట్ అవుతుందని టాలీవుడ్, బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మరి.. బన్నీ అట్లీ, లోకేష్‌ కనకరాజ్ తర్వాత సినిమా అయినా తెలుగు డైరెక్టర్ తో చేస్తాడో లేదో చూడాలి.

CLICK HERE TO READ ప్రయత్నం ఫలించేనా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply