Maoist | బయటపడ్డ మావోయిస్టు ఆయుధ కర్మాగారం

Maoist | చర్ల, ఆంధ్రప్రభ : చతీష్ఘడ్ సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్టేషన్ పరిధిలోని మేటగూడెం అటవీప్రాంతంలో మావోయిస్టుల భారీ ఆయుధ కర్మాగారం భద్రతా బలగాలకు చిక్కింది. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టుల కోసం అడవులను గాలిస్తుండగా ఈ డంప్ లభ్యం అయినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. డంప్ లో కంట్రీ మేడ్ తుపాకులు 3, లేత్ మిషన్, డ్రిల్ మిషన్, ఐరన్ కట్టర్ లాంటి ఆయుధాలు తయారు చేసేందుకు ఉపయోగించే పరికరాలు లభించినట్లు తెలిపారు.

Leave a Reply