Domestic stock markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Domestic stock markets | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1065 పాయింట్ల నష్టంతో ముగియగా, నిఫ్టీ 353 పాయింట్ల నష్టంలో ముగిశాయి. ఒక్క రోజులోనే రూ.9లక్షల కోట్ల సంపద ఆవిరయ్యాయి. స్టాక్ మార్కెట్లు ఇంత భారీగా నష్టపోవడం ఈ సంవత్సరంలో ఇదే తొలిసారి కావచ్చు.
ఆర్తి సర్ఫ్యాక్టెంట్స్ లిమిటెడ్, పటేల్ రిటైల్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, అంజని పోర్ట్ ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ రసయాన్ లిమిటెడ్, ఆల్మండ్జ్ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
