Gantashala | మినుము సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి

Gantashala | మినుము సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి
- మండల వ్యవసాయ అధికారిణి డి.అనూష
Gantashala | ఘంటసాల, ఆంధ్రప్రభ : మినుము సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని మండల వ్యవసాయ అధికారిణి డి.అనూష తెలిపారు. ఈ రోజు మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మినుము సాగులో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ… మండలంలో ప్రస్తుత మినుము పంట 30-45 రోజుల దశలో ఉన్నాయని మినుము పంటలో రాబోయే నెల రోజులు చాలా కీలకం అని, కావున రైతులు అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. ప్రస్తుత పొలాల్లో పొగాకు లద్దె పురుగు ఉదృతి గమనించడం జరిగిందని, నివారణకు నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరోపైరీపాస్ 2.5 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలియజేశారు.
మినుము పంటలో ఎక్కడైనా పసుపు పచ్చ మచ్చలతో మినుము మొక్కలు గమనించినట్లయితే పల్లాకు వైరస్ మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలని లేకపోతే మిగతా మొక్కలకు పల్లాకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. కావున వేపనూనెను పిచికారి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి శ్రీకాకుళం గ్రామ సర్పంచ్ యం.రవి ప్రసాద్, ఉప సర్పంచ్ శీలం శ్రీను, కే.పవన్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
