Leopard dies | బంగారుపల్లి శివారులో చిరుత మృతి

Leopard dies | జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బంగారుపల్లి శివార్లలో చిరుతపులి మృతి చెందటం కలకలం లేపింది. తెల్లవారుజామున స్థానికులు ద్వారా సమాచారం అందటంతో ఫారెస్ట్అధికారులు, పశువైద్యాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు. దట్టమైన అడవిలేక పోయినప్పటికీ, ఫారెస్టు ఏరియా కానప్పటికీ అలాంటి స్థలంలో చిరుత చనిపోవడం అనుమానాస్పదంగా మారింది.

Leopard dies

చిరుత చనిపోయిన కొద్ది దూరంలో గుట్ట ప్రాంతం ఉండటం, కొద్ది దూరంలోనే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు ఉండటంతో చిరుత పులి అవతలి రాష్ట్రాల నుంచి కూడా తరలిరావచ్చన్న అనుమానాన్ని ఫారెస్ట్ అధికారులు వ్యక్తపరుస్తున్నారు. చిరుత పులి వయస్సు కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. పోస్టుమార్టం అనంతరమే చిరుత మృతి కారణాలు తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలియచేస్తున్నారు. ఏది ఏమైనా అనుకోని ప్రాంతంలో చిరుతపులి చనిపోవడంతో జుక్కల్ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply