transfer | సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్

transfer | నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన రఘుపతి రెడ్డి బదిలీ కావడంతో బదిలీపై శ్రీనివాస్ ఇక్కడకు రావడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన సీఐ ని నర్సంపేట ఎస్‌ఐలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం సీఐ మాట్లాడుతూ… ప్రజల రక్షణకోసం నిరంతరం పనిచేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

Leave a Reply