Chennur | వివేక్ మంత్రి అవ్వడం ప్రజల అదృష్టం

Chennur | వివేక్ మంత్రి అవ్వడం ప్రజల అదృష్టం

  • మంత్రి జూపల్లి

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రి అవ్వడం చెన్నూరు ప్రజల అదృష్టమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, జూపల్లి పాల్గొన్నారు. పట్టణంలో నూతనంగా 42కోట్ల 50లక్షలతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణానికి భూమిపూజ నిర్వాహంచిన మంత్రి జూపల్లి మాట్లాడుతూ… ఎన్నో ప్రాణ త్యాగల ఫలితంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

పది సంవత్సరాల బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడ‌ని ఏద్దేవా చేశారు. మంత్రి వివేక్ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం అందించే పథకాలు అందనివారు నిరాశ పడవద్దని రానున్న రోజుల్లో అందుతాయన్నారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ… 40కోట్లతో పట్టణ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు మరింత ఉత్సాహన్ని నింపినట్లయితే మరో 40కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply