Varun Tej | ఈసారైనా సక్సెస్ సాధించేనా..?

Varun Tej | ఈసారైనా సక్సెస్ సాధించేనా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా హీరో వరుణ్ తేజ్.. ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు. అయితే.. ఈమధ్య కాలంలో వరుసగా ఫ్లాపులు చూశాడు. ఏ సినిమా చేసినా ప్లాప్ అవ్వడమే కానీ.. యావరేజ్ గా కూడా ఆడలేదు. ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. దీనికి మేర్లపాక గాంధీ డైరెక్టర్. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా టైటిల్ అనౌన్స్ చేసి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇంతకీ.. టైటిల్ ఏంటి..? ఈ సినిమాతో వరుణ్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

వరుణ్ తేజ్ వరుస ప్లాపులతో కెరీర్ లో వెనకబడ్డాడు. ఇక డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా వరుసగా ప్లాపులతో సరైన సక్సెస్ లేక హిట్ కోసం తపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్, గాంధీ కలిసి సినిమా చేస్తుండడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోను ఆమధ్య రిలీజ్ చేశారు. ఈ వీడియోను బట్టి కొరియన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఇదేదో డిఫరెంట్ మూవీ అనిపించింది. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కాకపోతే ఈసారి హిట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారట మేర్లపాక గాంధీ.

ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి కొరియన్ కనకరాజు అనే టైటిల్ అనౌన్స్ చేసి గ్లింప్ రిలీజ్ చేశారు. ఈ టైటిలే కాదు.. గ్లింప్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ ఫన్ తో.. ఆడియన్స్ థ్రిల్ కలిగించేందుకు ఈ మూవీ రెడీ అవుతుంది. సమ్మర్ లో కొరియన్ కనకరాజు చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీలకు కొరియన్ కనకరాజు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
