ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి…

ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి…
రాప్తాడు, ఆంధ్రప్రభ : ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు పదే పదే తెలియజేస్తున్నారు. అలాగే మన జిల్లాలో ఇప్పటికే ఎండల వేడికి గర్భవతులు ప్రజలు తట్టుకోలేక పోతున్నారని డాక్టర్ శివకృష్ణ పేర్కొన్నారు.శనివారం రాప్తాడు మండల పరిధిలోని జి.కొత్తపల్లి గ్రామం నందు ఇమ్యునైజేషన్ (వ్యాధి నిరోధక) కార్యక్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ 1వ సంవత్సరం లోపు పిల్లలు, గర్భవతులు బాలింతలకు టీకాలు సకాలంలో వేయించుకోవాలని తెలిపారు.
ప్రజారోగ్యాన్ని రక్షించడంలో అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో ఈ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. బయట ఎండలు 40 నుండి 42 డిగ్రీల వరకు ఉన్నాయి ఈ వేడి ఎండలు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. అందువలన గర్భవతులు చిన్నపిల్లలు బాలింతలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తరచూ మంచినీళ్లు, మజ్జిగ తాగాలి గాలి ఆడే ప్రదేశంలో కూర్చోవాలి.
అలాగే కొంచెం నీరసం అనిపించిన వెంటనే ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ను కలుపుకొని తాగాలి (లేదా) ఒక లీటర్ నీటిలో ఒక చిటికెడు ఉప్పు గుప్పెడు చక్కెర కలుపుకొని త్రాగాలి. ప్రతిరోజు సాయంత్రం పూట ఇళ్ళ ముందు నీళ్లు ఎక్కువగా చల్లుకోవడం వలన వేడుతాపం తగ్గే అవకాశం ఉంది అప్పుడు ఆరు బయట కూర్చోవడానికి బాగుంటుందన్నారు.
గ్రామాల్లో గర్భవతులు బాలింతలు ఏఎన్ఎం ఆశకు అందుబాటులో ఉండాలన్నారు.సమస్య ఏదైనా చిన్నదైనా పెద్దదైనా వెంటనే ఆశకు సమాచారం అందించాలన్నారు. ఏఎన్ఎం ఆశ అందించే సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నాగలక్ష్మి ఆశ విజయలక్ష్మి అంగనవాడీ టీచర్ సరస్వతి గర్భవతులు స్వర్ణ కుమారి మేఘన బాలింతలు ఆదెమ్మ వీణ పిల్లలు తల్లులు పాల్గొన్నారు.
