ఆలయంలోని స్వయంగా లడ్డు ప్రసాదం తయారీ…

ఆలయంలోని స్వయంగా లడ్డు ప్రసాదం తయారీ…

ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వయంగా లడ్డు ప్రసాదం తయారీ చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం, విశ్వాస పరిరక్షణ దృష్ట్యా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అత్యంత శుచి శుభ్రతతో, ఉన్నత నాణ్యతతో దేవస్థానం ఆవరణంలోనే తయారు చేయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ, కార్యనిర్వాణాధికారి సాకే రమేష్ బాబుతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులకు అందించబడే లడ్డు ప్రసాదాన్ని, వేదోక్త విధానాలతో బ్రాహ్మణుల చేత తయారు చేయించి, భక్తులకు పవిత్రతతో కూడిన ప్రసాదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఇకపై భక్తులు స్వామివారి దర్శనానంతరం శుభ్రమైన రుచికరమైన పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దేవస్థానం ప్రాంగణంలోనే, సులభంగా పొందగలరన్నారు. ఈ సదుపాయం త్వరలోనే ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా భక్తులకు మరింత విశ్వాసం ఆనందం కలగడమే కాకుండా దేవస్థానం ప్రతిష్టను మరింతగా ఇనుముడింప జేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply