గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 14వ ఎన్టీపీసీ. చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణలోని , హయత్ నగర్ కు చెందిన 12 సంవత్సరాల మామిడిపల్లి హాస్య అండర్-13 బాలికల రికర్వు విభాగంలో బంగారు పతకం కైవశం చేసుకుంది
89 మంది పోటీ పడగా రజత పతకం ఆంధ్రప్రదేశ్ కు, కాంస్య పతకం మహారాష్ట్రకు దక్కేయి. హైదరాబాద్ రమాదేవి పబ్లిక్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న మామిడిపల్లి హాస్య, గుర్రంగూడ ఈగిల్స్ ఆర్చరీ అకాడమీలో కోచ్ నూతన్ దగ్గర శిక్షణ పొందింది. .
ఉదయం 5.00 గంటల నుండి 7.30 వరకు శిక్షణ, కఠోర సాధన చేసి బంగారు పతకాన్ని సాధించింది. తన గెలుపులో తన తల్లితండ్రులు శ్రీధర్ & మనిత, , కోచ్ నూతన్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
గత సంవత్సరం జరిగిన ICSE జాతీయ పోటీలలో బంగారు, రజత పతకాలు హాస్య గెలుచుకుంది.
ప్రస్తుతం సాధించిన స్కోర్:
హాస్య 349/360 పాయింట్లు, స్వర్ణం (తెలంగాణ)
శివాని 343/360 పాయింట్లు, రజతం (ఆంధ్ర ప్రదేశ్)
వైదేహి 342/360 పాయింట్లు, (మహారాష్ట్ర).
తెలంగాణ బాలిక స్వర్ణం గెలుపు పై తెలంగాణ మరియూ రంగారెడ్డి ఆర్చరీ అసోసియేషన్ లు హర్షం వ్యక్తం చేశాయి.