24-carat gold | భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌లు

24-carat gold | భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌లు

24-carat gold | మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గిన రేట్లు
ఇవాళ ఎగ‌బాకిన గోల్డ్‌
15వేలు పెరిగిన వెండి
24 క్యారెట్స్‌ తులం – రూ.1,58,350
22 క్యారెట్స్‌ తులం – రూ.1,45,150
18 క్యారెట్స్‌ తులం – రూ.1,18,760

24-carat gold | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. మొన్న‌టివ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన గోల్డ్ రేట్లు మ‌ళ్లీ పైపైకి పోతున్నాయి. బంగారం, వెండి ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో తెలియ‌డం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇటీవల భారీ మార్పులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువ, దిగుమతి సుంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు కూడా బంగారం ధరల మార్పులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో సీజన్లతో సంబంధం లేకుండా డిమాండ్ పెరగడం వల్ల కూడా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతోంది.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,310 పెరిగింది. ప్ర‌స్తుతం తులం రూ.1,58,350కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 1200 పెరిగింది. ప్ర‌స్తుతం దాని ధ‌ర రూ.1,45,150గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.980 పెరిగింది. తులం ధ‌ర రూ.1,18,760గా నమోదైంది.

వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. ఒక్క రోజే 15వేలు పెరిగింది. ప్ర‌స్తుతం కిలో వెండి ధ‌ర 2,85,000గా న‌మోదైంది.

CLICK HERE TO READ Nifty 89 points | ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు..

CLICK HERE TO READ MORE