1st june | 24 స్థానాల్లో.. ఏపీలో నాలుగు స్థానాలకు జూన్ 18న పోలింగ్

1st june | 24 స్థానాల్లో.. ఏపీలో నాలుగు స్థానాలకు జూన్ 18న పోలింగ్

1st june | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల పరిధిలో ఖాళీ అయిన 24రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈసీ ప్రకారం జూన్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 8 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన నిర్వహించనుండగా.. జూన్ 11 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

రాజ్యసభ ఎన్నికలు జూన్ 18న జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు కూడా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.

Leave a Reply