19thaprileditorial | మోడీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు

19thaprileditorial | మోడీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు

19thaprileditorial | మహిళా రిజర్వేషన్ బిల్లు – లక్ష్యం మరియు వ్యూహం
పార్లమెంటులో బిల్లు ఎందుకు విఫలమైంది?
మహిళా సాధికారతపై ప్రభుత్వ దృష్టి
సమాజంలో మహిళల స్థితి – వాస్తవ పరిస్థితులు
వ్యూహాత్మక తప్పిదం లేదా రాజకీయ ప్రయోగం?

19thaprileditorial | ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షా కాలంను ఎదుర్కొంటున్నారు. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా తన చతురతతో అవలీలగా పరిష్కరించగల ఓర్పు, నేర్పు కలిగిన ఆయన నియోజకవర్గాల పునర్వర్గీకరణ అంశంపై చాలా గడ్డు పరిస్థితిను ఎదుర్కొంటున్నారు. దీనిని కూడా ఎదుర్కొనే సత్తా ఆయనకు ఉంది.

భిన్న జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు కలిగిన మన దేశంలో ఎవరినీ నొప్పించకుండా, అందరికీ సమ్మతమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన ఆయన ఈ అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తన రాజకీయ చాణక్యంను ఉపయోగించి వివాదాస్పదమైన ఈ అంశాన్ని రాజ్యాంగ సవరణ అంశంతోనూ, మహిళా రిజర్వేషన్ అంశంతోనూ జోడించి శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో కలిపి ప్రవేశపెట్టిన బిల్లు మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడం వల్ల పార్లమెంటులో వీగిపోయింది.

అది వీగిపోతుందని అందరికీ తెలుసు. ఆయనకూ తెలుసు. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జనంలో ఉన్న సెంటిమెంట్ కారణంగా, దాంతో పాటు ఈ బిల్లు కూడా సభ ఆమోదం పొందుతుందన్న వ్యూహంతో ఆయన ఈసారి సాహసం చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లు వల్ల తమకు వచ్చే స్థానాల సంఖ్య తగ్గిపోతాయన్న భయం పురుషుల్లో ఉంది.

అలాంటి ఆందోళనలు లేకుండా చేయడం కోసమే నియోజకవర్గాల పునర్వర్గీకరణ బిల్లును దీనితో జోడించారు. అంతేకాక, మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేందుకు, మహిళలకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంను ఈసారైనా పారద్రోలేందుకు ఇది చక్కని అవకాశంగా ఆయన భావించారు.

ఆయన తన హయాంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళను ఎంపిక చేసిన ఘనత ఆయనకే చెందుతుంది. అంతేకాక, కేంద్రంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను ఒక మహిళకు అప్పగించి, ఆమె ద్వారా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టించారు. ఇవన్నీ మహిళాభ్యున్నతి పట్ల ఆయన త్రికరణ శుద్ధికి నిదర్శనాలు.

అదే మాదిరిగా ఇప్పుడు ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న ఆయన ఉద్దేశ్యంను తప్పుపట్టలేం. అయితే, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడం వల్ల ఆయన వ్యూహం ఫలించలేదు.

మన దేశ జనాభాలో పురుషుల కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువ. అయితే, వారిలో చాలామంది వంటింటికే పరిమితం కావడం వల్ల ప్రాపంచిక విషయాలకూ, విద్యాభివృద్ధి రంగాలకూ దూరంగా ఉంటున్నారు. మహిళా విద్య కోసం రాజా రామమోహన్ రాయ్, బాపూరావు పూలే, మన రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంస్కర్తలు ఎంతో కృషి చేశారు. వారి కృషి ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకే విద్యా వ్యాప్తి జరిగింది.

ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు. సామాజిక సంస్కరణలు జోరందుకోవడంతో ఇప్పుడు కొంతమేరకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ముందుకు వస్తున్నారు. మహిళల్లో విద్యా వ్యాప్తికి కృషి జరుగుతున్నా, పాతకాలపు ఆచారాలు, కట్టుబాట్ల వల్ల వారు గడప దాటలేకపోతున్నారు.

అయితే, ప్రైవేట్ రంగంలో ప్రస్తుతం మహిళలే బాగా రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రాణించడం కోసమే రిజర్వేషన్ల కోసం వారు పట్టుపడుతున్నారు. ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు)తో పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ప్రధాని మోడీ వ్యూహం. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లుకు దీనిని జోడించారు. బిల్లుకు ఆమోదానికి అవసరమైన మెజారిటీ లేకపోవడం వల్ల అది వీగిపోయింది. ఇది వైఫల్యం కాదు, వ్యూహాత్మక తప్పుటడుగు మాత్రమే.

Leave a Reply