Ukraine-Farmers-Crisis : ఉక్రెయిన్ రైతన్న దివాలా..! Andhra Prabha Top Story
Ukraine-Farmers-Crisis : ఉక్రెయిన్ రైతన్న దివాలా..! Andhra Prabha Top Story
- బ్లాక్ సీ మూసివేతతో ఎగుమతులకు భారీ షాక్
- ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతులు 75% పతనం
- పంట చేతికొచ్చినా అమ్ముకోలేని దుస్థితి
- క్రెయిన్ రైతన్నకు అపార నష్టం
- ఉక్రెయిన్‌కు బిగ్ షాక్..
- $2.5 బిలియన్ల నష్టం
( కీవ్, ఆంధ్రప్రభ(
అటు రష్యా బాంబుల వర్షం.. ఇటు నల్లసముద్రం లో రవాణాకు అంతరాయంతో.. ఉక్రెయిన్ రైతన్న అల్లాడి పోతున్నాడు. ప్రస్తత సీజన్ లో ఇబ్బడి ముబ్బడిగా పంట దిగుబడి చేతికి వచ్చినా.. ఇతర దేశాలకు పంపించే అవకాశం లేదు. నిల్వ చేసే గిడ్డంగులు నిండిపోయాయి. ఇక పొలాల్లోనే పంటను దాచుకునే స్థితి ఏర్పడింది. స్వదేశంలో మార్కెట్ లేదు. కనీసం కష్టార్జితం లెక్క ప్రకారం గిట్టుబాటు కష్టంగా మారింది. అయిన కాడికి తెగనమ్మటానికి స్వదేశీ మార్కెట్ కదలనేని స్థితి. చేతిలో పంటను అమ్మితేనే..శీతాకాలం పంటకు పెట్టుబడి లభిస్తుంది. ఇప్పటికే అప్పులు మీద అప్పులు చేసిన ఉక్రెయిన్ రైతన్న వడ్డీల పడగలో అల్లాడి పోతున్నాడు. ఏతావాతా..రష్యాతో యుద్ధం కారణంగా.. ఉక్రెయిన్ అన్నదాత దివాలా తీశాడు.
Ukraine-Farmers-Crisis :అయ్యో,, అన్నదాతా,,:
రష్యా ఆక్రమిత ప్రాంతంలోని రైతుల దుస్థితి వర్ణనాతీతం.
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో పెద్ద భాగాన్ని 2022లో రష్యా ఆక్రమించింది, ఈ ప్రాంంలో మూడింట రెండు వంతుల భూమిని ఉక్రెయిన్ రైతులు కోల్పోయారు.ఈ రైతులు తాజాగా మరో రకం ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు; రష్యా దాడులతో నల్ల సముద్ర (Black Sea) రేవుల నుండి ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోగా.. తాజాగా చేతికి వచ్చిన పంట ప్రమాదంలో పడింది. గోధుమ,, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి ఉక్రెయిన్ తన పంటల ఎగుమతుల్లో దాదాపు 90 శాతాన్ని నల్ల సముద్రం మార్గం ద్వారానే చేపడుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో గోధుమ కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నెలలో మొక్కజొన్న కోత కూడా ప్రారంభం కానుంది. ఈ పంటను ఎలా సమొ్మ చేసుకోవాలో.. ఉక్రెయిన్ రైతులకు అర్థం కావటం లేదు. నల్ల సముద్రంలో అంతరాయంతో ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడుతుందనే ఆందోళనల కారణంగా, ప్రపంచ ప్రమాణ చికాగో ధాన్యపు ధరలు జూలైలో ఏడాదికి పైగా కాలంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ, స్థానిక దిగుబడులు పేరుకుపోవడంతో ఉక్రెయిన్ దేశీయ ధరలు పడిపోయాయి.
నUkraine-Farmers-Crisis :ల్ల సముద్రం బ్లాకేడ్ ..
బల్గేరియా, జార్జియా, రొమేనియా, టర్కీ, రష్యా, ఉక్రెయిన్ దేశాలు పంచుకునే నల్ల సముద్ర జలాలను, ధాన్యంతో పాటు ముడి చమురు శుద్ధి చేసిన ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు.
ఉక్రెయిన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దిగ్బంధనానికి ముందు, ఉక్రెయిన్ ఈ జలమార్గం ద్వారా నెలకు సుమారు 4-5 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేది.
యుద్ధం ప్రారంభంలో ఆహార సంక్షోభం భయాలు తలెత్తడంతో, నల్ల సముద్రం గుండా ఉక్రెయిన్ ధాన్యాన్ని అనుమతించే ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి ,టర్కీ కుదిర్చాయి. దీం
Ukraine-Farmers-Crisis :ప్యాడీ కారిడార్ ధ్వసం
తో ఆ దేశ ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. 2023లో రష్యా ఆ ఒప్పందం నుండి వైదొలగినప్పటికీ, ఉక్రెయిన్ నాటో సభ్య దేశాలు రొమేనియా ,బల్గేరియా జలాల గుండా, నల్ల సముద్రం పశ్చిమ తీరం వెంబడి తన సొంత “ధాన్యపు కారిడార్”ను ప్రారంభించింది. జులై ఆగస్టు ప్రారంభంలో రష్యా, ఉక్రెయిన్ నల్ల సముద్ర ఓడరేవు మౌలిక సదుపాయాలపై 70కి పైగా దాడులు చేసింది. 62 నైఖలను ధ్వంసం చేయడంతో, ఎగుమతులు మళ్లీ దాదాపుగా నిలిచిపోయాయని ఉక్రెయిన్ ఓడరేవుల పరిపాలన విభాగం తెలిపింది. ఆగస్టు మొదటి రెండు వారాల్లో ధాన్యం ఎగుమతులు గతేడాదితో పోలిస్తే 75% పడిపోయాయి. తమ దాడులు చట్టబద్ధమైన సైనిక మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, విదేశీ ఆయుధాలను రవాణా చేసే నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయని రష్యా చెబుతోంది.
Ukraine-Farmers-Crisis :ప్రత్యామ్నాయం అత్యవసరం
ధాన్యాన్ని సరిగ్గా నిల్వ చేసి, ఆరబెడితే చాలా సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది, కానీ ఉక్రెయిన్‌లో నిల్వ సామర్థ్యం కొరత ఏర్పడింది. 11 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. పొలాల్లో తాత్కాలికంగా నిల్వ చేయడానికి ప్రత్యేక సంచులను అందించడంలో సహాయం చేయాలని అధికారులు ఉక్రెయిన్ భాగస్వాములను కోరారు. ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలు అత్యవసరంగా అవసరమని, వాటిని కనుగొనడం గతంలో కంటే చాలా కష్టంగా మారవచ్చని కూడా వారు చెబుతున్నారు. 2022 ప్రారంభంలో, నల్ల సముద్ర ఓడరేవులను దిగ్బంధించినప్పుడు, వ్యవసాయ ఎగుమతులను ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల గుండా రైల్వేలు రోడ్ల ద్వారా మళ్లించారు.
Ukraine-Farmers-Crisis : అవకాశాలూ శూన్యం
ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరిపే అవకాశం సన్నగిల్లిందని కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన ఒలే నివియెవ్స్కీ అన్నారు. దీనికి పాక్షికంగా పొరుగున పోలాండ్‌తో సంబంధాలు క్షీణించడం ఒక కారణమని, అక్కడి రైతులు గతంలో చౌకైన ఉక్రేనియన్ ధాన్యం నుండి వచ్చే పోటీని వ్యతిరేకించారని ఆయన తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో కఠిన వాణిజ్య నిబంధనలు, డాన్యూబ్ నదిలో నీటి మట్టాలు తగ్గడం, రైల్వే మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు కూడా ఉక్రెయిన్ ఎంపికలను పరిమితం చేశాయి.
Ukraine-Farmers-Crisis :నష్టం అపారం
దిగ్బంధనం కారణంగా ఈ ఏడాది మిగిలిన భాగంలో ఉక్రెయిన్ సుమారు 2.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని కోల్పోతుందని గత నెలలో సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల అక్కడి రైతులు సుమారు 3 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నారని యూఏసీ అంచనా వేయగా, దివాలా ముప్పును అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుందని మార్చుక్ అన్నారు. ఇప్పటికే, 2022 నుండి వ్యవసాయ రంగంలో యుద్ధకాల నష్టాలు 90 బిలియన్ డాలర్లను దాటాయి . చురుకైన పోరాటం, భారీ మైనింగ్, షెల్లింగ్ నీటిపారుదల లేకపోవడం వల్ల సాగులోని భూమి దాదాపు నాలుగో్ వంతు తగ్గిపోయింది.ప్రభుత్వం రైతుల కోసం అత్యవసర సహాయ ప్యాకేజీని ప్రవేశపెట్టడంతో పాటు, రాష్ట్ర రుణ కార్యక్రమాలను విస్తరించడం, రుణ నిబంధనలను సులభతరం చేయడం మరి నిర్వహణ మూలధన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. కానీ.. ఉక్రెయిన్ వ్యవసాయ రంగం కోలుకోలేని దైన్య స్థితిలో ఉన్నమాట వాస్తవం,
