పంట ధాన్యం అగ్గికి ఆహుతి

పంట ధాన్యం అగ్గికి ఆహుతి
కొత్తగూడ, ఆంధ్రప్రభ:-
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిందనే ఆనందం అడిఆశలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే మండలం లోని తాటివారి ఎంపల్లి గ్రామానికి చెందిన తాటి రుద్రవర్మ పంట కోసి రోడ్డు పై అరబోసాడు. గురువారం అడవిలో ఎరగడి పడటం తో అది రోడ్డు పైన ఆరోబోసిన వరి, మొక్క జొన్న ధాన్యం రాసులను అంటుకున్నాయి. రైతు ఎంత ప్రయత్నం చేసిన మంట అదుపులో రావడం కష్టం అవడం తో గ్రామస్తుల సహాయం తో కొంత మేరకు ధాన్యం ను కాపాడుకోవడం జరిగిందని తెలిపారు. ఎంతో శ్రమ చేసి పండించిన పంట అగ్గి కి అహుతి అవడం తో రైతు కన్నీరు మున్నిరయ్యడు.
