నేటి రాశిఫలాలు 27.04.25

మేషరాశి : ఈ రోజు బద్ధకం అధికంగా ఉంటుంది. పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరులతో వ్యవహారాల్లో ఓపిక అవసరం. తొందరపాటు పనికి రాదు.

వృషభం: ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులను కలుస్తారు.

మిథునం : కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ఉద్యోగార్థులు అనుకూల ఫలితం సాధిస్తారు.

కర్కాటకం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులలో అజాగ్రత్త, తొందరపాటు పనికి రాదు. మీ తొందరపాటు వలన డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారిపై ఒక కన్నేసి ఉంచండి.

సింహం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి భుజించండి. శ్వాస లేదా జీర్ణసంబంధ అనారోగ్యం బారిన పడే అవకాశముంటుంది. ఉద్యోగంలో కొంత అనుకూలత ఉంటుంది. సహోద్యోగుల సహాయం అందుకుంటారు.

కన్య : మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొద్ది కాలంగా ఇబ్బందిపెడుతున్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

తుల : ఆరోగ్యం బాగుంటుంది. కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.

వృశ్చికం : ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కొంత అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వాయు సంబంధ అనారోగ్యం బాధించవచ్చు. డబ్బు విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. అనుకోని అవమానం లేదా మానసిక ఆందోళన ఎదురవవచ్చు. ఇతరుల విషయాల్లో కల్పించుకోకండి.

ధనుస్సు : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ శక్తిపై నమ్మకముంచిముందడుగేయండి, విజయం మీ సొంతమవుతుంది. అనుమానంతో ఏ పని చేయకండి. దూరప్రయాణం చేసే అవకాశముంది.

మకరం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తిలో మార్పు కానీ, అభివృద్ధి కానీ ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది.

కుంభం : ఈ రోజు ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవటం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినడం లేదా ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.

మీనం : ఆర్థికంగా చాలా అనుకూలించే రోజు. పాత బకాయిలువసూలవడం కానీ, అనుకోని ఆదాయం రావడం కానీ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులకు కూడా అనుకూల దినం.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply