న్యూయార్క్: బాంబు బెదిరింపు రావడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన న్యూయార్క్-న్యూదిల్లీ (ఏఏ 292) విమానాన్ని రోమ్‌కు మళ్లించారు.
న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 8.14 గంటలకు విమానం బయల్దేరింది. ఇది దిల్లీకి వచ్చే బదులు ఆదివారం సాయంత్రం రోమ్‌కు వెళ్లింది. ఇటలీ వాయుసేన విమానం రక్షణగా వస్తుండగా అది అక్కడ సురక్షితంగా దిగిందని, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని సంబంధిత విమానయాన సంస్థ తెలిపింది.