మంచిర్యాల టౌన్, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొన్న ప్రభాకర్ రేపు మంచిర్యాలలో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు.
ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రేపు ఉదయం 10 గంటలకు హైదారాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బయలుదేరుతారని తెలిపారు. అతరువాత 11 గంటలకు మంచిర్యాల కలెక్టరేట్ లో హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతారని, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుంటారని వెల్లడించారు.
ఐబీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని అంబేడ్కర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం ఆవిష్కరించడంతో పాటు పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
ఐబీలో నిర్మాణమవుతున్న సూపర్ స్పెషాలిటీ, మాతా శిశు ఆసుపత్రి నిర్మాణ పములను పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం ఓపెన్ టాప్ జీవులో వాటర్ ట్యాంకు, జగదాంబ సెంటర్, మేయిన్ రోడ్డు, ఆర్చన టెక్స్ చౌరస్తా మీదుగా బాలుర ఉన్నత పాఠశాల మైధానంలో జరిగే సభా స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందని, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. మళ్లీ 1:30 గంటలకు హైదారాబాద్ కు తిరుగు ప్రయనమవుతారని తెలిపారు.