State Level | రాష్ట పోటీలకు కిష్టాపూర్ విద్యార్థుల ఎంపిక…

State Level | రాష్ట పోటీలకు కిష్టాపూర్ విద్యార్థుల ఎంపిక…
State Level | జన్నారం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకుల అనన్య ఒలంపియాడ్(Olympiad)లో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎంపికైంది.
జూనియర్స్ విభాగం ఉపన్యాస పోటీల్లో ఏడో తరగతి విద్యార్థిని ఆకుల అనుశ్రీ జిల్లాలో రెండో స్థానాన్ని సాధించి రాష్ట్రస్థాయి(State Level) పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థినీలను గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, ప్రకాష్ బానావత్, డి.మణెమ్మలను ఆ పాఠశాల హెచ్ఎం గుండ రాజన్న, ఉపాధ్యాయులు జాడి మురళి, ఎదులాపురం గోవర్ధన్, నరహరి శర్మ, రాజన్న, బుచ్చి లింగయ్య, నగేష్, అజీమ్, శ్రీనివాస్, జ్యోతిశీల, రజితరాణి, సుస్మిత, స్వప్న, పీడీ కాంతయ్య, తదితరులు అభినందించారు.
