శ్రీ తటాక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

భీమారం, ఆంధ్రప్రభ : గ్రేటర్ పరిధిలోని 55వ డివిజన్ భీమారం తటాక ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి హనుమాన్ స్వాములు గురుస్వామి కొండం రాజయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఆలయంలో ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పంచామృత అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు శ్రీనాథచార్యులు ఆధ్వర్యంలో హోమం నిర్వహించి ఇరుముడి కట్టుకున్నారు. ఈ సందర్భంగా స్వాముల శ్రీ రామ నామ స్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది స్వాములు,భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
