సౌత్‌జోన్ ఈఎన్‌టీ కాన్ఫరెన్స్‌లో విశేష ప్రతిభ

సౌత్‌జోన్ ఈఎన్‌టీ కాన్ఫరెన్స్‌లో విశేష ప్రతిభ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వైద్య విద్యతో పాటు పోటీ వేదికలపై కూడా కేఎంసీ(KMC) విద్యార్థులు తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. ఇటీవల ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఓటోలారింగోలజిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా(Association of Otolaryngologists of India) (AOI) ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సౌత్‌జోన్‌ స్థాయి ఈఎన్‌టీ కాన్ఫరెన్స్‌(ENT Conference)లో కర్నూలు మెడికల్‌ కాలేజీ ఈఎన్‌టీ విభాగానికి చెందిన పీజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు.

తృతీయ సంవత్సరం పీజీ విద్యార్థిని డా. దివ్య నాగేశ్వరి క్విజ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, డా. షేఖ్‌ షాజియా జబీన్ టెంపోరల్‌ బోన్‌ డిశెక్షన్‌(Jabeen Temporal Bone Dissection) విభాగంలో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నారు.ఈ విజయంపై కేఎంసీ ప్రిన్సిపల్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డా. కే. చిట్టి నరసమ్మ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, విభాగ ఇన్‌చార్జి డా. హరికృష్ణ, ఫ్యాకల్టీ సభ్యులను కూడా ప్రశంసించారు. ప్రిన్సిపల్‌ను కలిసిన వారిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా. లింగన్న(Linganna) ఎస్‌.ఆర్‌, డా. ప్రేసి షరాన్‌, పాల్గొన్నారు.

Leave a Reply