Rs. 52,000 cheque | సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిది

Rs. 52,000 cheque | సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిది

  • ఎమ్మెల్యే వేముల

Rs. 52,000 cheque | చిట్యాల, ఆంధ్రప్రభ : సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవని లాంటిదని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పొట్లపల్లి స్వామి ఇటీవల అనారోగ్యం బారిన పడి చికిత్స నిమిత్తం అతడికి మంజూరైన సీఎం సహాయనిధి రూ. 52,000 చెక్కును(Rs. 52,000 cheque) ఈ రోజు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పొట్లపల్లి స్వామికి మంజూరైన చెక్కును అందజేశారు.

చిట్యాలకు చెందిన మిర్యాల గోపాల్ రూ. 37 వేలు, సానియా రూ. 12000 వేలు, ఆగు సువర్ణ రూ. 22,500, మద్దె పూరి పూజ రూ. 37000, షేక్ సమరీన్ రూ. 23,000, మొత్తం ఒక లక్ష 83 వేల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, చిట్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply