Revenue | సౌమ్యనాథస్వామి సేవ‌లో..

Revenue | సౌమ్యనాథస్వామి సేవ‌లో..

  • రాజంపేటలో కలెక్టర్ తొలి పర్యటన
  • ఆల‌య దర్శనం.. తహసీల్దార్లతో సమీక్ష సమావేశం

Revenue | రాజంపేట, ఆంధ్రప్రభ : జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా రాజంపేట నియోజకవర్గ పర్యటనకు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఈ రోజు వెళ్లారు. నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని(Soumyanathaswamy Temple) కలెక్టర్ సందర్శించారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయ‌న‌కు స్వాగతం పలికారు. రాజంపేట సబ్ కలెక్టర్ భావన నందలూరులో కలెక్టర్‌కు స్వాగతం పలికారు.

అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు, సత్కారం అందజేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ను రాజంపేట సబ్ కలెక్టర్ భావన పూల మొక్కను అందజేసి స్వాగతించారు.

Revenue |

తదుపరి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండల తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజంపేట, నందలూరు, టి.సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని రెవెన్యూ, అభివృద్ధి(Revenue, Development) అంశాలపై ఆయా మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగంగా రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రభుత్వ పాలన(Government Administration) కొనసాగుతుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం చేపట్టే అన్ని పరిపాలనా సంబంధ అంశాలను యధావిధిగా అమలు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, భూ వివాదాలు, లీగల్ సంబంధిత అంశాలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో మండల తహసీల్దార్లు పారదర్శకంగా, సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు త్వరితగతిన, నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు.

రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏ గ్రామంలోనూ పారిశుధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎంపీడీవోలు, మున్సిపల్(Municipal) కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Leave a Reply