ఫిష్ వెంకట్ కు అండ‌గా ప్ర‌భాస్ !

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య సమస్యలతో హైద‌రాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి సుమారు రూ.50 లక్షల ఖర్చు అవుతుందని వెల్లడించారు.

ఈ సమాచారంతో స్పందించిన స్టార్ హీరో ప్రభాస్, తన పెద్ద మనసు చాటుకున్నారు. ఫిష్ వెంకట్ కుటుంబానికి తన మద్దతు ప్రకటించిన ప్రభాస్, ఆపరేషన్‌కు కావలసిన మొత్తం ఖర్చును తానే భరిస్తానని తన టీమ్ ద్వారా తెలియజేశారు. ఇదే విషయాన్ని ఫిష్ వెంకట్ కుమార్తె మీడియాకు తెలిపారు. కిడ్నీ డోనర్ సిద్ధంగా ఉంటే వెంటనే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించారట ప్రభాస్ టీమ్.

Leave a Reply