POCSO Case | త్వరితగతిన పరిష్కరించాలి

POCSO Case | త్వరితగతిన పరిష్కరించాలి

  • ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

POCSO Case | ఒంగోలు క్రైమ్, ఆంధ్రప్రభ : పోలీస్ అధికారులతో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్(Harshvardhan) రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. నాణ్యమైన దర్యాప్తుతో గ్రేవ్ కేసులను త్వరితగతిన ఛేదించాల‌ని, గుడ్ ట్రయల్ మానిటరింగ్(Good Trial Monitoring) ద్వారా కోర్టుల్లో నిందితులను దోషులుగా నిరూపించి శిక్షలు శాతం పెంచేలా శ్రమించాల‌న్నారు.

జిల్లాలో మ‌త్తు ప‌దార్థాల ఉనికి లేకుండా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప్రాపర్టీ నేరాల కట్టడి చేస్తూ రికవరీ శాతం పెంచేలా కృషి చేయాల‌న్నారు. ఫోక్సో కేసు(POCSO Case )ల విచారణ వేగవంతం చేయాల‌ని, నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాల‌న్నారు. రోడ్డు ప్రమాదాల నివార‌ణ‌కు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల‌న్నారు. ఎన్ఫోర్స్మెంట్ పెంచి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాల‌న్నారు.

POCSO Case |వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

POCSO Case

దర్యాప్తులో ఉన్న శారీరక నేరాలు, దొంగతనం, గంజాయి. ఇతర గ్రేవ్ కేసులు, కేసుల గుడ్ ట్రయల్ మానిటరింగ్, ఎన్ఫోర్స్మెంట్ (Enforcement)/ రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై జిల్లా పోలీస్ కార్యాలయ నుంచి ఒంగోలు, దర్శి, కనిగిరి, మార్కాపురం సబ్ డివిజన్ల‌ డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో జిల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి ఆయా కేసుల సత్వర పరిష్కారంకు దోహదపడే విధంగా తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో గ్రేవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని, సమగ్ర దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను అరెస్ట్ చేసే విధంగా, తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో నిర్ణీత సమయంలో ఛార్జ్ షీట్ ఫైల్ (Charge Sheet File) చేయడంతో పాటు, కేసుల్లో శిక్షాశాతం పెంచేందుకు ఎక్కువ కృషి చేయాలని సూచించారు. సంవత్సరం ముగింపు సందర్భంగా పెండింగ్ కేసులను త్వరితగతంగా తగ్గించాలన్నారు. రానున్న లోక్ అదాలత్‌ (Lok Adalat) లో రాజీ పడదగిన కేసులను లిస్టు అవుట్ చేసి, ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

CLICK HERE TO READ Prajadarbar | స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం..

click here to read more

Leave a Reply