Commissioner |భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి

Commissioner | భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి

  • ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ మౌర్య

Commissioner | తిరుపతి (ఆంధ్రప్రభ): నగరంలో భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. శనివారం ఉదయం నగరంలోని భూపాల్ హౌసింగ్ కాలనీ, కూరపాటి లేవుట్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు. తమ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పార్కు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలను పరిశీలించాలని, తప్పనిసరిగా అనుమతులు ఉండాలని తెలిపారు.

అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగితే సంబందించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కల లేకుండా చర్యలు చేపట్టాలని వెటర్నరీ ఆఫీసర్ ను ఆదేశించారు. భూపాల్ హోసింగ్ కాలనీ లో డ్రైనేజి కాలువల నిర్మాణానికి, పార్కు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య , మున్సిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ లు వెంకట ప్రసాద్, శిల్ప, ఏసిపి మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

Leave a Reply