ఐపీఎల్ 2025 లో భాగంగా ఈరోజు మల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు పుంజుకుంటున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు.. మ్యాచ్ ను తిప్పే ప్రయత్నం చేస్తుంది.
తమ సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్.. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు బాదింది. అయితే, ఆ తరువాత వరుస ఓవర్లలో వికెట్లు పారేసుకుంది.
7వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ కృణాల్ పాండ్యా బౌలింగ్ లో ఓపెనర్ ప్రభమన్ సింగ్ (33) ఔటవ్వగా.. 8వ ఓవర్ రొమారియో షెపర్డ్ వేసిన బౌలింగ్ లో 4వ బంతికి కృణాల్ చేతికి చిక్కాడు శ్రేయస్ అయ్యార్. 9వ ఓవర్ తొలి బంతికే నెహాల్ వధేరా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.