భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు
భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి తరలివచ్చారు.
సభా వేదిక పరిసరాలు కాషాయ జెండాలతో సందడిగా మారాయి. మరికాసేపట్లో ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు.
