ELECTIONS| పద్మశాలి సత్తా చాటాలి..

    ELECTIONS| కమలాపూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పోటీచేసి ఎక్కువ స్థానాలను దక్కించుకొని పద్మశాలి సత్తా చాటాలని కమలాపూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొప్ప శివశంకర్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్ భవనంలో ఇవాళ పద్మశాలి సంఘం జిల్లా నాయకులతో కలిసి కమలాపూర్ మండల నాయకులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పద్మశాలి అభ్యర్థులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ సమావేశంలో ఒకే గ్రామం నుండి సర్పంచు పదవుల్లో కానీ, వార్డు పదవుల్లో కానీ పద్మశాలి కులానికి చెందిన అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితులను పరిశీలించి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కమలాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పద్మశాలి కులం నుండి గ్రామ శాఖ అధ్యక్షులు బైరి దశరథం, ఒకటో ఎంపిటిసి సభ్యురాలు మెండు రాధిక రమేష్ లు పద్మశాలి కులం నుండి కమలాపూర్ సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.

    అదేవిధంగా దేశరాజ్ పల్లె గ్రామం నుండి ఒకే ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడంతో ప్రధానంగా ఈ రెండు అంశాలపై చర్చించడానికి జిల్లా పద్మశాలి సంఘం నాయకులు, కమలాపూర్ మండల నాయకులు నిర్ణయం తీసుకొని సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒకే గ్రామానికి చెందిన పదవికి పోటీ పడుతున్న ఇద్దరు పద్మశాలి అభ్యర్థులతో మాట్లాడి పద్మశాలి ఐక్యతను చాటడానికి, పద్మశాలి అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇద్దరిలో ఒకరు ఎన్నికల బరిలో నుండి తప్పుకోవాలని సూచనలు, సలహాలు చేశారు. పద్మశాలి సత్తా చాటడానికి ఎవరో ఒకరు పెద్దమనుషు చేసుకొని త్యాగం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

    Leave a Reply