అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మల్కిపురం మండలం కేశనపల్లి – గొల్లపాలెం మధ్య ONGC గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ సేకరణ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్మికులు.. ప్రమాద స్థలం నుంచి తీశారు. అయితే మరికొందరు లీక్‌ను ఆపడానికి ప్రయత్నించారు. అయితే, ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు స్పృహ కోల్పోయారు. బాధితులను తోటి కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమాచారం అందుకున్న అమలాపురం ఆర్డీఓ కొత్త మాధవి, రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీపై దర్యాప్తు చేపట్టారు.
AP | గొల్లపాలెంలో ఓన్‌జీసీ గ్యాస్ లీక్ !
