28న ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు

28న ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు

హాజరుకానున్న రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, రాష్ట్ర అధికారులు

తొర్రూరు, ఆంధ్రప్రభ : ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 28న ఉదయం 9 గంటలకు తొర్రూరులో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయిల్ పెడ్ జిల్లా ఇన్చార్జ్ చిలువేరు దయాకర్ తెలిపారు.ఈనెల 28న ఆయిల్ ఫామ్ సాగుపై నిర్వహించే అవగాహన సదస్సు పై ఆదివారం మండలంలోని హరిపిరాలలోని నర్సరీలో ఆయిల్ ఫెడ్ ఇంచార్జ్ దయాకర్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు తో రైతులు నికరంగా ఆదాయం సాధించవచ్చని, దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈనెల 28న తొర్రూరు మండలం హరిపిరాల శివారు పామాయిల్ నర్సరీలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ భాష లు పాల్గొననున్నారని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో కోతుల బెడద,దొంగల బెడద ఉండదన్నారు.నాలుగేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 9 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని తెలిపారు.తొర్రూరు మండలం హరిపిరాల నర్సరీ లో మూడు లక్షల మొక్కలు రైతుల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు.

మొక్కలు నాటిన నాలుగేళ్ల అనంతరం ఏటా ఎకరానికి 8 నుంచి 12టన్నుల ఆయిల్‌ పామ్‌ కాయల దిగుబడి వస్తాయన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుచేయాలనుకునే రైతులకు మొక్కలకు 90శాతం రాయితీ, డ్రిప్‌ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు.మొక్కలు ఎదిగే వరకు నాలుగేళ్ల వరకు ఎకరానికి రైతుకు రూ.4,200 చొప్పున ప్రభుత్వం ఇస్తుంద న్నారు. ఒక్కసారి మొక్కలు నాటితే పంట మొద లైనప్పటి నుంచి 30ఏళ్ల పాటు రైతు దిగుబడి పొందుతాడన్నారు.

కేవలం నీరు పెట్టి పైపాటు ఎరువులు వేస్తే సరిపోతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు రూ.23,005 మద్దతు ధర అందిస్తుందన్నారు. ఎకరానికి 50 వరకు ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటుకోవాలన్నారు.ఈ పంటలో అంతరపంటలు సాగుచేసుకోవచ్చన్నారు. ఈనెల 28న నిర్వహించే ఆయిల్ ఫామ్ అవగాహహన సదస్సుకు సంబంధిత అనుబంధ శాఖల అధికారులు,శాస్త్రవేత్తలు, సాగు రైతులు పాల్గొని ఉన్నారని తెలిపారు.

Leave a Reply