KCR | పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

KCR | పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
KCR |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్చార్జుల నియామకం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. ప్రజల్లో చురుకుగా పనిచేయని నాయకులకు ఈసారి టికెట్లు ఉండవని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, హామీల అమలు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నేతలకు సూచించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను కూడా సమావేశంలో ఖరారు చేశారు.
జిల్లా పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలపై కూడా కేసీఆర్ నేతలకు సూచనలు చేశారు. పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణపై బీజేపీ పెంచుతున్న ఫోకస్, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు.
