Ex Cm Jagan | దేశంలోనే అతిపెద్ద స్కాం వైఎస్ జగన్ ఆరోపణ

Ex Cm Jagan | దేశంలోనే అతిపెద్ద స్కాం వైఎస్ జగన్ ఆరోపణ
Ex Cm Jagan | విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలోనే అతిపెద్ద స్కాం అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) తీవ్రంగా విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ (Governor S. Abdul Nazeer) కు జగన్ అందజేశారు.
Ex Cm Jagan ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం ఎందుకు?
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్యాయాలను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను గవర్నర్ (Governor ) దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రజల నిరసనలు, ఆధారాలతో సహా పూర్తి వివరాలు అందించామన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలు జీవించలేరు. వైద్యం, విద్య వంటి మౌలిక సేవలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.
Ex Cm Jagan ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా

తమ ప్రభుత్వ హయాంలో ఒక విజన్‌తో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని జగన్ (Jagan) గుర్తు చేశారు. ప్రతి కాలేజీలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందేలా చూశామన్నారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా ఈ కాలేజీలు నిలిచాయి. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారి చేతుల్లో పెడితే పేదలకు వైద్యం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలు ప్రజల బలమైన నిరసనకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. ఈ విషయంపై గవర్నర్ స్పందించి ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Ex Cm Jagan ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదు
మెడికల్ కాలేజీల (Medical Colleges) ను ప్రైవేటుకు కట్టబెట్టడమే అతిపెద్ద స్కాం (Biggest scam) అన్నారు. ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కాం అన్నారు. రూ.120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరెలా ఇస్తారు? ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా? దేశ చరిత్రలో ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదు వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
