ఉద్యోగాల పేరుతో ప్రలోభ పెడితే ఫిర్యాదు చేయండి..

ఉద్యోగాల పేరుతో ప్రలోభ పెడితే ఫిర్యాదు చేయండి..

కోర్టు ఉద్యోగాల నియామకాల్లో పైరవీలకు తావులేదు…
మంత్రి ఫరూక్ తో ఫోటోలు దిగిన వారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మకండి..
జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి..

నంద్యాలబ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టులోను వివిధ కోర్టుల లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు రాష్ట్ర మైనార్టీ నై శాఖ మంత్రి ఫరూక్ తో ఫోటోలను అడ్డుపెట్టుకొని ప్రయత్నాలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 96 నూతన కోర్టులను మంజూరు చేశారన్నారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాకు 4 కోర్టులు కేటాయించడం జరిగిందన్నారు.

ఈ కోర్టుల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1734 వివిధ రకాల పోస్టులను మంజూరు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందన్న రు.ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు రోస్టర్ విధానం అనుసరించి అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగాల పేరుతో కొందరు మధ్యవర్తులు లేదా దళారులు అమాయక యువతను మోసం చేసే అవకాశం ఉందన్నారు.

మంత్రి ఫరూక్,ఫిరోజ్ ఫయాజ్ లేదా మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే నమ్మకండి అన్నారు. మాతో దిగిన ఫోటోలను చూపించి, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే ప్రలోభాలకు రికావద్దుఅన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేదా ఉద్యోగాల పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు వస్తాయని ఆశపడి నిరుద్యోగులు తమ జీవితాలను పాడు చేసుకోవద్దని తెలిపారు. నిరుద్యోగులు జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.

Leave a Reply