‘ఆపరేషన్ తిరంగా’ను ఆవిష్కరించిన జియో హాట్‌స్టార్

భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జియో హాట్‌స్టార్ ‘ఆపరేషన్ తిరంగా’ను ఆవిష్కరించింది. ఇది దేశపు స్వేచ్ఛా స్ఫూర్తిని గౌరవించేందుకు ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకువచ్చిన వినూత్న ప్రయత్నం. ‘ఒక జెండా, పలు కథలు’- ఆలోచనాత్మకంగా క్యూరేటెడ్ శక్తివంతమైన కథనాల శ్రేణితో, ఈ ప్రయత్నం భారతీయ మువ్వన్నెల పతాకం ఇతివృత్తంగా రూపొందించిన పలు గుర్తింపులు, భావోద్వేగాలను, ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. ప్రచారంలో భాగంగా, ప్లాట్‌ఫామ్ ఆగస్టు 15న తన కంటెంట్ లైబ్రరీకి రోజంతా ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుకొని, అందుబాటులో ఉండే బ్రాండ్‌ను సృష్టించాలనే తన నిబద్ధతను చాటి చెబుతుంది.

కంటెంట్ లైబ్రరీని అన్‌లాక్ చేయడంతో పాటు, భారతదేశపు రంగులు, స్ఫూర్తిని ప్రతిబింబించే స్ల్పాష్ స్క్రీన్‌తో వీక్షకులను జియో హాట్‌స్టార్ స్వాగతిస్తూ, కథ చెప్పడాన్ని ఒక సెల్యూట్‌గా మారుస్తుంది. సరికొత్తగా రూపొందించిన ఇంటర్‌ఫేస్ భారతదేశపు ధైర్యాన్ని, పాత్రను గౌరవించే శక్తివంతమైన కథనాల సేకరణకు వేదికను అందిస్తోంది. శౌర్యం, త్యాగం, జాతీయ గుర్తింపుల సంక్లిష్టతలను అన్వేషించే కథల సమాహారాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. జెండా ప్రతీకవాదం నుంచి తీసుకున్న ఈ లైనప్ టేక్ ఆఫ్, మద్రాస్ కేఫ్ అండ్ IB71 వంటి టైటిల్స్‌తో ధైర్యం, రహస్య వీరత్వం తదితరాలు కాషాయాన్ని ప్రేరేపిస్తుంది : సలాకార్, నీర్జా, మంగళ్ పాండే: ది రైజింగ్, చంద్రశేఖర్ వంటి త్యాగం, స్థితిస్థాపకతల భావోద్వేగాలను ప్రతిధ్వనించే కథలు తెలుపు; సర్జమీన్, కేసరి 2, ఎయిర్‌లిఫ్ట్‌తో సహా సాంస్కృతిక వారసత్వం, సగర్వంతో పాతుకుపోయిన కథనాల ద్వారా ఆకుపచ్చను ప్రతిబింబిస్తుంది. ఈ కథలు దేశానికి ఒక సమగ్రమైన, ఉత్తేజకరమైన నివాళిని అందిస్తాయి- క్యాంపెయిన్‌లో భాగంగా, స్వాతంత్ర్య దినోత్సవం నాడు, ఉచితంగా ప్రసారం చేస్తుండగా, వీటన్నింటినీ ప్రేక్షకులు వీక్షించవచ్చు.

ఈ క్యాంపెయిన్ గురించి, జియోస్టార్, బ్రాండ్ అండ్ క్రియేటివ్- హెడ్, మీనాక్షి అచన్ మాట్లాడుతూ… వీక్షకులకు ఏమి చూస్తారో, ఎప్పుడు చూస్తారో, దానితో వారు ఎలా మమేకం అవ్వాలో ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తూ, కథ చెప్పడం ద్వారా అనంతమైన అవకాశాలను అన్‌లాక్ చేయడంపై జియో హాట్‌స్టార్ విశ్వసిస్తుందన్నారు. ఆపరేషన్ తిరంగ అనేది ఆ ఫిలాసఫీకి కొనసాగింపు అన్నారు. ఇది స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ఆచరించుకునే, యాక్సెస్‌కు ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తుందన్నారు. ప్రతి వీక్షకుడు దేశపు ధైర్యం, స్థితిస్థాపకతను, గుర్తింపును ప్రతిబింబించే కథలను గుర్తించి, వీక్షించేందుకు వీలు కల్పిస్తుందని వివరించారు.

Leave a Reply