AP | కొత్త జంట‌కు జ‌గ‌న్ ఆశీర్వాదం

కర్నూలు బ్యూరో : కర్నూలులో కోడుమూరు వైఎస్సార్‌సీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ హాజర‌య్యారు. స్థానిక జీఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వైయస్‌ జగన్‌ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్ ను పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, ఇతరులున్నారు.

Leave a Reply