హైదరాబాద్ : శనివారం తెల్లవారుజామున గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium)లో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను (International Yoga Day celebrations) ఆయుష్, ఆరోగ్యశాఖ ఘనంగా నిర్వహించాయి. ఈ అధికారిక కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే 5వేల మంది విద్యార్థులు, యువకులు, యోగా సాధకులు ఈ యోగా డే కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.
