అమ్మవారి అలంకారంలో భక్తురాలు.. ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఆకర్షణ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: నగరంలోని పాల ఫ్యాక్టరీ ప్రాంతానికి చెందిన భక్తురాలు దేవి.. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అలంకారాన్ని ధరించి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారి రూపంలో ప్రత్యేకంగా కనిపించిన ఆమె భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
అమ్మవారి అలంకారంలో వచ్చిన భక్తురాలిని చూసి తోటి భక్తులు ఆకట్టుకున్నారు. భక్తి భావంతో ఆమె దర్శనం చేసుకోవడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
