బాసర సరస్వతి అమ్మవారి సేవలో దర్శకుడు హరీష్ శంకర్
బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలోని బాలాలయంలో సినీ దర్శకుడు హరీష్ శంకర్ మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు.
అమ్మవారి బాలాలయంలో ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో హరీష్ శంకర్‌కు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అచ్యుత్ కుమార్, హరీష్, కళాదర్ శర్మ, వేద పండితులు నవీన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
